NTV Telugu Site icon

Naresh: చంద్రబాబు అరెస్ట్‌.. నటుడు నరేశ్‌ కీలక వ్యాఖ్యలు

Naresh

Naresh

Actor Naresh Crucial Comments on Chandrababu Arrest: టీడీపీ ఛీఫ్ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్షన్లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడిన నరేష్ ను చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ స్పందన ఏంటి? అని అడిగితే తాను ఒక లీడర్ గురించి మాట్లాడటం లేదని, ఏది న్యాయం? ఏది ధర్మం అనేది సినిమాలో చెప్పామని అన్నారు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుందని పేర్కొన్న ఆయన వ్యక్తిగత కక్షతో, అణచివేత ధోరణితో ఎవర్ని అయినా బంధించడం ప్రజాస్వామ్యంలో ఒక తిరుగుబాటును సూచిస్తుందని, ఆ తిరుగుబాటు రిజల్ట్ ఓటు రూపంలో వస్తుంది అది మనం చూస్తాం అన్నారు. ఎమర్జెన్సీ కూడా నల్ల మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్న ఆయన డబ్బుకీ రాజకీయానికీ చాలా చిక్కుముడులు పడిపోయాయి అయితే ఆ ముడి విప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు, ఆయనకు మద్దతు అని అనను కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి పోరాటం సాగడాన్ని గర్విస్తున్నానని అన్నారు.

Keedaa Cola Trailer: కోలా డ్రింకులో బొద్దింక: ఇదండీ ‘కీడా కోలా’ కథాకమామీషు

చంద్రబాబు అరెస్టు తర్వాత సినిమా వాళ్లు మౌనంగా ఉన్నారెందుకని అడిగితే సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రజా సంక్షేమం వైపే ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ గారి టైమ్ లో కూడా వరదల్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జోలెపట్టుకుని డబ్బు సేకరించి ప్రజల్ని ఆదుకున్నామని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు సినీ పరిశ్రమ వారికి అండగా ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అయితే బాబు అరెస్టుకు సమాధానం ప్రజలే చెప్పాలని, మేం కూడా ప్రజల్లో భాగమే అని అన్నారు. ఇవాళ సైలెంట్ మార్పు జరుగుతోందని, ఓటు అనే ఆయుధంతోనే దీనికి పరిష్కారం చూపుతారని అన్నారు. సినీ పరిశ్రమ సైలెంట్ గా ఉండటం వెనుక కారణం ఏదో ఉంటుందని, సొసైటీ నిశ్శబ్దంగా ఉందంటే ఒక తిరుగుబాటు కోసం వేచి చూస్తోందని అర్థం అని అన్నారు. నేను ఏ పార్టీని ఉద్ధేశించి మాట్లాడనని పేర్కొన్న ఆయన కింగ్ సినిమా కూడా దీనికి లింక్ అయి ఉందని గత 50 ఏళ్లుగా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందని, ఈసారి కూడా క్లియర్ మాండేట్ వస్తుందని అన్నారు.