Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?

Mouli Tanuj

Mouli Tanuj

ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం కాలేదు. ఆ సమయంలో నాకేం చేయాలో తోచలేదు. అలా అనడం బాధగా అనిపించినప్పటికీ, నేను ఏమీ చేయలేను. అందుకే మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ గత ఏడాది కాలంగా ఆ బాధను భరిస్తూనే, మౌనంగా ఉంటున్నాను” అని మౌళి తెలిపారు.

ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ తరువాత అప్లాస్‌తో పాటు చాలా హేట్ అండ్ జెలసీ చూశాను. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయిన టైంలో, ఓ న్యూస్ ఛానెల్ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను “రాలేను సార్, నాకు జ్వరంగా ఉంది” అంటే.. “నీ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు చూసుకుంటానులే” అని వార్నింగ్ ఇచ్చాడు. అతను, నేను భయపడిపోయి నిజంగానే పరిగెత్తుకుని వచ్చేస్తా అనుకున్నాడు. నేను కూడా భయపడిపోయి, మర్నాడు వాళ్ళ ఛానెల్‌కు ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి తప్పవు, అంతే! అంటూ చెప్పుకొచ్చాడు మౌళి.