Actor Mohan of Kamal hassans Apoorva Sagodharargal dies at 55: తమిళ సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. తమిళ సీనియర్ నటుడు ఒకరు దారుణమైన స్థితిలో మృతి చెందారు. కమల్ హాసన్ తో కలిసి ‘విచిత్ర సోదరులు’ అనే సినిమాలో ఆయన స్నేహితుడుగా నటించిన మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందారు, ఇక ఆయన వయసు 55 సంవత్సరాలు. తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుపరంగున్రం ప్రాంతంలో శవమై కనిపించారు. సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన మోహన్ తమిళ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా నటించేవాడు. 1989లో కమల్ హాసన్ నటించిన ‘అపూర్వ భోత్రగల్’ చిత్రంలో ఆయన కమల్ స్నేహితుల్లో ఒకరిగా నటించాడు. అలాగే ‘నాన్ గాడ్’, ‘అతిశయ భన్ని’ సహా పలు సినిమాల్లో కూడా నటించారు. తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో మోహన్ కొన్నేళ్ల క్రితం తన సొంత ఊరు వదిలి తిరుపరంగున్రం వచ్చాడని అంటున్నారు. అక్కడ పేదరికం కారణంగా పెద్ద రథం రోడ్డుపై అడుక్కునేవాడని ఈ క్రమంలోనే జూలై 31న మోహన్ పెరియ రథ రోడ్డులో నిస్సహాయ స్థితిలో శవమై కనిపించాడు. `
Sruthi Shanmugapriya : ఏడాది క్రితమే పెళ్లి.. నటి భర్త మృతి.. షాకింగ్ రీజన్ వెలుగులోకి?
ఈ విషయం తెలుసుకున్న తిరుపరంగున్రం పోలీసులు మోహన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. . పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహం సీనియర్ నటుడు మోహన్ దిగా గుర్తించి మెట్టూరులోని అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో మాథూర్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్‌కు ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారని అంటున్నారు. అయితే కమల్ లాంటి నటుడితో కలిసి నటించిన మోహన్ ఇలా రోడ్డు పక్కన శవమై తేలడం పట్ల సినీలోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మోహన్ కొద్దికాలంగా సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బంది పడ్డాడని, ఏ చిన్న పాత్ర కూడా దొరకకపోవడంతో ఆర్థికంగా, కనీసం తిండి తినలేని స్థితికి చేరుకున్నాడని అంటున్నారు. పేదరికం, అనారోగ్యం కారణం వల్లే చనిపోయారనే ప్రచారం జరుగుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
