NTV Telugu Site icon

Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?

Bigg Boss

Bigg Boss

Actor Kichcha Sudeep Tweeted About Not Hosting The Bigg Boss Kannada: ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ ప్రారంభమై రెండు వారాలు గడిచిన తరువాత కిచ్చా సుదీప్ ‘ఇదే చివరి సీజన్, ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేయను’ అని ప్రకటించారు. సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని సుదీప్ సహా బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ మరో ట్వీట్‌లో మరోమారు చెప్పుకొచ్చారు. ఈ సీజన్ ప్రారంభం కాకముందే సుదీప్ మరిన్ని సినిమాలు చేయాలని అన్నారు. ఆ విషయంలో ప్రస్తుతం ‘మ్యాక్స్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన, దానితో పాటు అనూప్ భండారి దర్శకత్వంలో ‘బిల్లారంగ బాషా’ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారణంగా ఈ నిర్ణయం ఉండవచ్చనే ఊహాగానాలు ముందు నుంచి వచ్చాయి. తాజాగా టీఆర్ఫీ షేర్ చేస్తూ చేసిన ప్రకటన తరువాత మరో ట్వీట్ చేస్తూ నా ట్వీట్‌ని చూసిన ప్రతి ఒక్కరూ చూపిన ప్రేమ, మద్దతును నేను అభినందిస్తున్నాను.

Ugravatharam: వామ్మో.. ప్రియాంక ఉపేంద్ర ‘ఉగ్రావతారం’.. చూశారా ?

ఛానెల్‌కు నాకు మధ్య ఏదో జరిగిందని కొందరు వీడియోలు చేస్తున్నారు. ఛానెల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను బిగ్ బాస్ నుండి వైదొలగడం వెనుక ఉన్న ఊహాగానాలు నిరాధారమైనవి, జస్టిఫికేషన్ లేనివి. నా ట్వీట్ సూటిగా, నిజాయితీగా ఉంది. కలర్స్‌తో నా అనుబంధం చాలా బాగుంది. ఛానెల్ ఎప్పుడూ నన్ను గౌరవంగా చూస్తోంది. నిజానికి ఈ సీజన్‌ ప్రారంభం కాకముందే ఈ సారి షోకి సుదీపర్‌కు బదులు వేరే నటీనటులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ఎట్టకేలకు సుదీప్ రావడంతో ఆ ఊహాగానాలకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు రెండు వారాల తర్వాత, ఆదివారం (ఆగస్టు 13) షో ప్రసారం అవుతుండగా, ‘బిగ్ బాస్ కన్నడ 11పై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ షో టీఆర్‌పీ చూస్తేనే మీకు ఈ షోపై, నాపై ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. నేను గత 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా బిగ్ బాస్‌తో కలిసి ప్రయాణించాను. కానీ ఇప్పుడు నేను దీని నుండి బయటపడాలి. ఇదే నా చివరి బిగ్ బాస్. నా నిర్ణయాన్ని చాలా సంవత్సరాలుగా బిగ్ బాస్ చూస్తున్న మీరందరూ, నా కలర్స్ టీమ్ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఈ సీజన్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుదాం. నేను కూడా మీ అందరినీ అలరిస్తాను’ అని ట్వీట్ చేశాడు సుదీప్.

Show comments