NTV Telugu Site icon

Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!

Darshan Wife Vijayalakshmi

Darshan Wife Vijayalakshmi

Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి ఆయన మృతిని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని విజయలక్ష్మి దర్శన్ తెలిపారు. దీంతో పాటు విజయలక్ష్మి దర్శన్ పై కోర్టు నుంచి నిషేధాజ్ఞలు తీసుకొచ్చారు.

Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్

ఈ కేసుకు సంబంధించి కట్టుకథలు ప్రచురించడంపై ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని షేర్ చేసిన విజయలక్ష్మి దర్శన్, “గత కొన్ని రోజులుగా, దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ బందువులు, స్నేహితులు వర్ణించలేని బాధను అనుభవించాము. గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లలో ఇకపై ఎలాంటి అబద్ధాలు, అనధికార సమాచారం ప్రచురించరాదని ఆమె అన్నారు. అమ్మ చాముండేశ్వరి(మైసూరు చాముండి అమ్మవారు)పై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. సత్యమేవ జయతే అని విజయలక్ష్మి అన్నారు. ఇక, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మిని బుధవారం (జూన్ 19) విచారించారు. హత్యాకాండకు జరిగిన తర్వాత దర్శన్ తన భార్య విజయలక్ష్మిని కలిశాడు.

అన్నపూర్ణేశ్వరి నగర్‌లోని పోలీసు స్టేషన్లో విజయలక్ష్మి దర్శన్ ను కలిసేందుకు అనుమతించారు. అనంతరం విచారణ నిమిత్తం విజయలక్ష్మిని గంటల తరబడి విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అంతకుముందు దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మీడియాల్లోనూ దర్శన్ పవిత్ర గౌడను దర్శన్ భార్యగా చూపిస్తున్నారని.. దీంతో విజయలక్ష్మి దర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. దర్శన్ కు విజయలక్ష్మి ఒక్కరే భార్య ఆమె తప్ప ఎవరూ లేరని అన్నారు. ఇక దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మంది నిందితుల పోలీసు కస్టడీ గురువారం (జూన్ 20)తో ముగియనుంది. నిందితులను ట్రయల్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది.

Show comments