Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్
- అన్నపూనేశ్వరి నగర్ పోలీసు కస్టడీలో దర్శన్
- నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడంపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ఇంజెక్షన్ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి ఆయన మృతిని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని విజయలక్ష్మి దర్శన్ తెలిపారు. దీంతో పాటు విజయలక్ష్మి దర్శన్ పై కోర్టు నుంచి నిషేధాజ్ఞలు తీసుకొచ్చారు.
Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్
Also Read
ఈ కేసుకు సంబంధించి కట్టుకథలు ప్రచురించడంపై ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని షేర్ చేసిన విజయలక్ష్మి దర్శన్, “గత కొన్ని రోజులుగా, దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ బందువులు, స్నేహితులు వర్ణించలేని బాధను అనుభవించాము. గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లలో ఇకపై ఎలాంటి అబద్ధాలు, అనధికార సమాచారం ప్రచురించరాదని ఆమె అన్నారు. అమ్మ చాముండేశ్వరి(మైసూరు చాముండి అమ్మవారు)పై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. సత్యమేవ జయతే అని విజయలక్ష్మి అన్నారు. ఇక, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మిని బుధవారం (జూన్ 19) విచారించారు. హత్యాకాండకు జరిగిన తర్వాత దర్శన్ తన భార్య విజయలక్ష్మిని కలిశాడు.
అన్నపూర్ణేశ్వరి నగర్‌లోని పోలీసు స్టేషన్లో విజయలక్ష్మి దర్శన్ ను కలిసేందుకు అనుమతించారు. అనంతరం విచారణ నిమిత్తం విజయలక్ష్మిని గంటల తరబడి విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అంతకుముందు దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మీడియాల్లోనూ దర్శన్ పవిత్ర గౌడను దర్శన్ భార్యగా చూపిస్తున్నారని.. దీంతో విజయలక్ష్మి దర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. దర్శన్ కు విజయలక్ష్మి ఒక్కరే భార్య ఆమె తప్ప ఎవరూ లేరని అన్నారు. ఇక దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మంది నిందితుల పోలీసు కస్టడీ గురువారం (జూన్ 20)తో ముగియనుంది. నిందితులను ట్రయల్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!