అల్లు హీరో శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేడన్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా లైన్ లోకి వచ్చి సోషల్ మీడియాను వీడబోతున్నాను. ఇది చాలా స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. “ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాకు చాలా స్పెషల్ డే. నా వృత్తి జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. విషయం ఏంటనేది రానున్న రోజుల్లో నేనే వెల్లడిస్తా… అప్పటి వరకూ కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వెంటనే పెళ్లి కుదిరిందా? అంటూ రకరకాల ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. ‘నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ’ అంటూ రిప్లై ఇచ్చారు శిరీష్.
Read Also : “అంధాధున్” ముందుగా ఈ స్టార్ హీరో… ఎలా చేజారిందంటే ?
మరో నెటిజన్ హాలీవుడ్ కు వెళ్తున్నారా ? అని ప్రశ్నించగా “అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది. అదే ఆనందం నా కెరీర్‌లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నాను’ అంటూ మిస్టరీని రివీల్ చేసేశాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ “ప్రేమ కాదంట” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అల్లు శిరీష్.
