మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామ్రేడ్ సిద్ద, నీలాంబరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను ఈ పాట ద్వారా తెలిపాడు దర్శకుడు కొరటాల శివ.
కామ్రేడ్ సిద్ధగా రామ్ చరణ్, నీలాంబరిగా పూజా హెగ్డే జంట చూడముచ్చటగా కనిపించారు. ఇక మణిశర్మ సంగీతం.. అనంత్ శ్రీరామ్ అచ్చ తెలుగు పదాలకు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా వాయిస్ మొత్తం కలిపి నీలాంబరి పాటను ఫ్రెష్ మెలోడీగా మర్చి లూప్ మోడ్ లోకి వెళ్లేలా చేశాయి. ఇక పాటలో రామ్ చరణ్ క్యూట్ డాన్స్ మూమెంట్స్ పాటకే స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియానుస్ షేక్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
