Site icon NTV Telugu

దసరా వార్ కు చిరు, బాలయ్య సిద్ధం

Acharya and Akhanda clash for Dussehra

కోవిడ్ -19 సెకండ్ వేవ్‌ టాలీవుడ్ భారీ సినిమాలు వరుసగా విడుదల తేదీలను ప్రకటించేసాయి. 2022 సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ ఖర్చీఫ్ వేసేశారు. “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలాఖరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. “ఆర్ఆర్ఆర్”ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ వార్ ఖాయం.

Read Also : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”

ఇక సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య ‘ఆచార్య’, ‘అఖండ’ రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాలు షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. ఒకవేళ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలను వాయిదా వేస్తే, ఆ టైములో ‘ఆచార్య’, ‘అఖండ’ విడుదలకు మార్గం సుగమం అవుతుంది. బాలకృష్ణ సినిమా నిర్మాతలు అక్టోబర్ 8న “అఖండ”ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ‘ఆచార్య’ అక్టోబర్ 12 లేదా అక్టోబర్ 13న రావొచ్చు అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే బాలయ్య, చిరు మధ్య దసరా వార్ మొదలైనట్టే.

బాలకృష్ణ, చిరంజీవి మధ్య చివరిసారిగా 2017 సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ జరిగింది. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సారి దసరా పండగకు మెగా, నందమూరి ఫైట్ జరగబోతోందన్న మాట.

Exit mobile version