Abhishek Nama Responds on Naveen medaram Issue: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పది డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. . ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే టాగ్ లైన్ తో రిలీజ్ కాబాహున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఒక్క విషయంలో ముందు నుంచి వివాదం నెలకొంది. బాబు బాగా బిజీ డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్’ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా పోస్టర్ మీద నవీన్ మేడారం పేరు ఉంది కానీ ఈ మధ్య పూర్తిగా ఆయన పేరు తొలగించి దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వచ్చింది. ‘డెవిల్’ కంటే ముందు అభిషేక్ పిక్చర్స్ సంస్థలో ‘బాబు బాగా బిజీ’ చేశారు నవీన్ మేడారం. అభిషేక్ నామా, ఆయనకు మధ్య ‘డెవిల్’కు ముందు సత్సంబంధాలు ఉన్నా ‘డెవిల్’ సమయంలో ఏదో జరిగి ఆయన్ని తప్పించారు అనే టాక్ అయితే ఉంది.
Jagapathi Babu: ఖాన్సార్ లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్
ఈ విషయం మీద నవీన్ మేడారం స్పందిస్తూ సినిమా తన బేబీ అన్నట్టు రాసుకొచ్చాడు. అయితే అభిషేక్ నామా ఇప్పుడు స్పందిస్తూ అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈమధ్య కాలంలో డైరెక్టర్ ను పీకేసి డైరెక్షన్ చైర్ లో కూర్చున్నది మీరే కదా అని అడిగితే కావాలని ఎందుకు చేస్తాం? పరిస్థితుల వల్ల అలా అయింది. అయితే పీకేసినట్టు ఒప్పుకుంటున్నారా? అని అడిగితే ఎందుకు పీకేస్తాం కానీ కొత్త డైరెక్టర్ కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడంతో తడబడ్డాడు అని ఆయన హ్యాండిల్ చేయలేడు అని భావించి తాను రంగంలోకి దిగానని అన్నారు. ఆయనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చింది తానేనని అయితే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయాడని, ఇది కమర్షియల్ గా మొదటి సినిమానే అని అన్నారు. నేను సపోర్ట్ చేశా, కాకపోతే కాన్వాస్ పెద్దది,ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు హ్యాండిల్ చేయలేడని భావించి నేను డైరెక్షన్ చేశా అని అన్నారు.