Abhishek Bachchan : కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ నానా రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరూ స్పందించట్లేదు. తరచూ వీరిద్దరూ వేర్వేరుగా కనిపిస్తుండటంతో ఈ రూమర్లు మరింత పెరుగుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ వీటిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని మా ఇంట్లో పెద్దగా పట్టించుకోం. కేవలం వర్క్ గురించి మాత్రమే మేం డిస్కస్ చేసుకుంటాం. ఖాళీగా ఉంటే అందరం కుటుంబ విషయాలను పంచుకుంటాం. మా అమ్మ, నా భార్య బయటి విషయాలను ఇంట్లోకి అస్సలు తీసుకురారు. బయట ఎన్ని రకాల రూమర్లు వచ్చినా వారు పెద్దగా పట్టించుకోరు. రీసెంట్ గా ఇలాంటివి మా గురించి ఎక్కువగా వస్తున్నాయి అంటూ తెలిపాడు అభిషేక్.
Read Also : WAR 2 : ఇట్స్ అఫీషియల్.. వార్ 2 తెలుగు రిలీజ్ నాగవంశీ
మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎలాంటి సమస్యలు లేవు. నేను ఐశ్వర్యరాయ్ ను స్విట్జర్ లాండ్ లో 1995లో ఫస్ట్ టైమ్ కలిశాను. అప్పుడే ఆమె నాకు ఎంతో నచ్చింది. ఫస్ట్ టైమ్ మేం డిన్నర్ కు వెళ్లాం. అప్పటి నుంచే ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. ఆమె వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మా నాన్నగారి సినిమాల్లో నటిస్తుందని తెలిసి ఇంకా సంతోషించాను. మెల్లిమెల్లిగా ఇద్దరం ఒకరికొకరం అర్థం అయ్యాం. మా ఇద్దరి మధ్య అప్పుడు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎప్పటికీ మేమంతా కలిసే ఉంటాం. నా కూతురు ఆరాధ్య అంటే మాకు ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆమెకు ఫోన్ లేదు. ఆమె మా ఇంటి గౌరవాన్ని కాపాడుతోంది. ఆమె ఎదుగుదల పట్ల మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎప్పటికీ ఆమె వ్యక్తిత్వానికి మేం గౌరవం ఇస్తూనే ఉంటాం అని చెప్పారు అభిషేక్ బచ్చన్.
Read Also : LAYA : చెస్ లో నేషనల్ ప్లేయర్.. కానీ ఆ కారణంగానే వదిలేసాను
