NTV Telugu Site icon

Abhishek Agarwal: దేశ ప్రజలకు, కశ్మీర్‌ పండిట్లందరికీ రెండు జాతీయ అవార్డులు అంకితం!

Abhishek Agarwal

Abhishek Agarwal

Abhishek Agarwal comments on national awards: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా ఉందని, ఇది ప్రజల సినిమా అని దేశ ప్రజలే ఈ అవార్డులు గెలుచుకున్నారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్న సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి, పల్లవి జోషికి, ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని పేర్కొన్న ఆయన ది కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రజల సినిమా అని అన్నారు. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు.

Allu Arjun : బ్రహ్మానందం ఇంటికి బన్నీ… గంటన్నర పాటు అక్కడే.. ఎందుకంటే?

ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు, అందుకే దేశ ప్రజలకు, కశ్మీర్‌ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం” అభిషేక్ అగర్వాల్ అన్నారు. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు అవార్డు పొందడం చాలా ఆనందంగా వుంది. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాట కి చంద్రబోస్ గారికి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‘’కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం మేము నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని పేర్కొన్న ఆయన పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావు లో ఉందని అన్నారు. ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నామని, దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను అయితే దానికి మీ అందరి సహకారం కావాలి అని ఆయన కోరారు.