Site icon NTV Telugu

Abhiram Movie: ఆసక్తి రేపుతున్న అభిరామ్ టీజర్

Abhiram Teaser Launched

Abhiram Teaser Launched

Abhiram Movie Teaser launched: లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాసులు నిర్మాతగా రామకృష్ణార్జున్ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా అభిరామ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శ్రీనివాసులు, ప్రసన్నకుమార్ ని కలిసి టీజర్ చూపించి రిలీజ్ చేయించారు. ఈ టీజర్ చూసిన అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది, పాటలకు చాలా మంచి స్పందన లభిస్తోంది. టీజర్ లో చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీతో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో కనిపిస్తోంది.

Bigg Boss 7 Arrests: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్!

ఈ సినిమాలో శివ బాలాజీ, యష్ రాజ్ తో పాటు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ రఘు బాబు, అన్నపూర్ణమ్మ, తులసి, వై విజయ నటించారు. గండికోట సంస్థానంలో భారీగా ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారని అన్నారు. అభిరామ్ టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ చాలా క్యాచీగా ఉందని అన్నారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూఈ అభిరామ్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ రామకృష్ణార్జున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన ఈ సినిమాకి సాగర్ నారాయణ ఎం సాహిత్యం అందించారు.

Exit mobile version