NTV Telugu Site icon

Abhay Bethiganti: ‘రామన్న యూత్’ కోసం మెగాఫోన్ పట్టిన మరో హాస్యనటుడు!

Abhay Turns Director

Abhay Turns Director

‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, “ఈ మూవీ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా రూపొందిస్తున్నాడు. ఆయనకీ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అభయ్ కు, చిత్రబృందానికి బెస్ట్ విషెస్” అని అన్నారు.

రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఓ యువకుడు చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ‘రామన్న యూత్’ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు ఆలోచింపజేసే నేటి సామాజిక విషయాలు కథలో ఉండబోతున్నాయి. రొటీన్ కు భిన్నమైన కొత్త తరహా కథ ఇదని తెలుస్తోంది. ఈ చిత్రంలో యూత్ లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.