NTV Telugu Site icon

Abbas: విశాల్ చాలామందిని పాడు చేశాడు.. అందుకే అతడంటే పగ

Voshal

Voshal

Abbas: ప్రేమ దేశం హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా అబ్బాస్ కటింగ్ అని పేరు వచ్చిందే ఆయన వలన. చాక్లెట్ బాయ్ లా కనిపించే అబ్బాస్.. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు రాకపోవడంతో తన కుటుంబంతో కలిసి న్యూజిల్యాండ్ లో సెటిల్ అయిపోయాడు. అక్కడ ఏ పని అయినా చేసేవాడు. పెట్రోల్ బంక్ లో పనిచేశాడు.. వెయిటర్ గా.. ట్యాక్సీ డ్రైవర్ గా.. ఇలా ఎన్నో పనులు చేసి ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సెటిల్ అయ్యాడు. చాలా ఏళ్ళ తరువాత అబ్బాస్ ఒక సర్జరీ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. ఆయనకు ఒక సర్జరీ జరుగుతుందని సోషల్ మీడియా ద్వారా తెలుపడంతో అబ్బాస్ గురించి చర్చ మొదలైంది. ఇక అలా.. చాలా ఏళ్ళ తరువాత అబ్బాస్ ఇండియా తిరిగివచ్చాడు. ఆయన కనిపిస్తే మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ఊరుకుంటాయా .. ఇంటర్వ్యూలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. మునుపెన్నడూ చెప్పని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అబ్బాస్ ఈ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. గతంలో అబ్బాస్ – హీరో విశాల్ మధ్య ఒక గొడవ జరిగిందని చాలా తక్కువమందికి తెలుసు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో వీరి మధ్య గట్టి యుద్ధమే జరిగింది. మొట్టమొదటిసారి ఆ గొడవపై అబ్బాస్ స్పందించాడు.

Sherlyn Chopra: రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు

” విశాల్ పై పగ అని చెప్పలేను కానీ, కోపం మాత్రం ఉండేది. నా పట్ల అతడు ప్రవర్తించిన తీరు చాలా దారుణం. అది నాకు నచ్చలేదు. అతడు చేసిన పని నేను ఎప్పుడో క్షమించాను. ఇప్పుడు కూడా విశాల్ ఎదురుపడితే హాయ్ అని పలకరిస్తాను. కానీ, సన్నిహితంగా మాత్రం మాట్లాడలేను. ఇండస్ట్రీలో అందరితో కలుపుకోలుగా ఉంటూ బంధాలను పెంచుకోవాలి. కానీ, విశాల్ తో మాత్రం అది ఎప్పటికి జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ సెకండ్ సీజన్ లో విశాల్ నాగురించి అబద్దాలు చెప్పుకొచ్చాడు. ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. అలాంటి వాతావరణంలో ఉండాలని నాకు అనిపించలేదు. నేనే వెనక్కి తగ్గాను. ఆరోజు నేను చాలా బాధపడ్డాను. అయితే ఆ తరువాత విశాల్ ఈ విషయమై బాధపడి ఉంటాడని అనుకుంటున్నాను. ఏదిఏమైనా ఇండస్ట్రీలో అతడు కూడా ఒకడు కాబట్టి అది నా మనసులో ఆలాగే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తమిళ్ హీరోలైన అజిత్, విజయ, సూర్య ల గురించి కూడా అబ్బాస్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కోలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇకపోతే అబ్బాస్ ఇండియా వచ్చింది కేవలం ఒక వారం ఉండివెళ్లిపోవడానికా.. ? లేక రీ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేయడానికా.. ? అనేది తెలియాల్సి ఉంది.