NTV Telugu Site icon

Jabardasth Hari: ఎర్ర చందనం స్మగ్లింగ్.. పరారీలో జబర్దస్త్ నటుడు

Hari

Hari

Jabardasth Hari: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ స్టార్ కమెడియన్స్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, మరికొంతమంది మాత్రం జబర్దస్త్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరిపై కేసు నమోదు అయ్యింది. హరి అలియాస్ హరిత.. లేడీ గెటప్ హరితగా చంటి టీమ్ లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హరి. ప్రస్తుతం అన్ని టీమ్స్ లో చేస్తున్న హరి.. జబర్దస్త్ కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెల్సింది. తాజాగా పోలీసులు అతని గ్యాంగ్ లోని కిషోర్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా హరి పేరు చెప్పడంతో అతని గుట్టు బయటపడింది.

Eagle: ‘ఈగల్’ గా రవితేజ.. ఈసారి ప్రకంపనలు మాములుగా ఉండవు

చిత్తూరు జిల్లా పుంగనూరులో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ తరలింపు వ్యవహారంతో హరికి సంబంధం ఉందని, దాదాపు రూ. 60 లక్షల సరుకును తరలించే ప్లాన్ కూడా అతిడిదే అని తెలిపారు. ఇక ఆ ఆపరేషన్ చేసే సమయంలో హరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ట్రై చేశామని, అతను తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. హరిపై కేసు నమోదు చేసిన పోలీసులు చేసి.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇది హరికి మొదటిసారి కాదని తెలుస్తోంది. గతంలో అతడిపై అనేక కేసులు ఉన్నాయని, అన్ని స్మగ్లింగ్ కేసులే అని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.