Site icon NTV Telugu

Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా

Sandeep

Sandeep

Aata Sandeep: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఆ రొమాన్స్ ఏంటి.. ఆ వైలెన్స్ ఏంటి.. అసలు ఆ మ్యూజిక్.. నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ వైలెన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని.. రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన క్లిప్ అంటే.. రణబీర్ ఎంట్రీ. ఒకపక్క రష్మికకు ఎంగేజ్ మెంట్ జరుగుతుంటే.. ఇంకోపక్క రణబీర్.. వైలెంట్ ఎంట్రీ అదిరిపోతోంది. ఇక పబ్ లో చిన్ని చిన్ని ఆశ మ్యూజిక్ కు రణబీర్ మైఖేల్ జాక్సన్ స్టెప్స్ తో అదరగొడతాడు. ఈ పర్టిక్యులర్ సీన్ కు, రణబీర్ స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రణబీర్ కు ఆ స్టెప్స్ నేర్పించింది మన సందీప్ మాస్టరేనంట. ఆ విషయాన్నీ ఆట సందీప్ ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy Vanga: యానిమల్ రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. సందీప్ ఏమన్నాడంటే.. ?

ఆట డ్యాన్స్ షో ద్వారా ఫేమస్ అయిన సందీప్.. ఆట సందీప్ గా మారి కొరియాగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లి.. ఈ మధ్యనే బయటకు వచ్చాడు. ఇక బిగ్ బాస్ కన్నా ముందే ఈ షూట్ జరిగినట్లు తెలుస్తోంది. సందీప్ ఆ సీన్ ను షేర్ చేస్తూ.. ” ఈ చిన్న బిట్ ను నేనే కంపోజ్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా సర్ కు థాంక్స్. దయచేసి యానిమల్ మూవీని థియేటర్ లో చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఆ స్టెప్స్ నేర్పించింది నువ్వా.. క్రెడిట్స్ నీ పేరు లేదేంటి.. నిజం చెప్పు అని కొందరు.. సూపర్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version