Site icon NTV Telugu

ట్రైలర్ : కామెడీతో ఆకట్టుకుంటున్న “ఆరడుగుల బుల్లెట్”

Aaradugula Bullet Movie Release Trailer

మాచో హీరో గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 40 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు లవ్, యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా ?, పెంచారు కదా అని పేరెంట్స్ కు, జీతాలిచ్చారు కదా అని బాస్ కు జీవితాలిచ్చేస్తే మీకు మీరు టైం ఎప్పుడు ఇచ్చుకుంటారండీ’ అంటూ హీరో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో సగం కామెడీ అండ్ లవ్, మిగతా సగం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Read Also: మరో అమానవీయ ఘటన… మానవజాతి తుడిచి పెట్టుకుపోయే సమయం !

ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం సమకూర్చారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా కీలక పాత్రలు పోషించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ‘ఆరడుగుల బుల్లెట్‌` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాశారు.

https://www.youtube.com/watch?v=FaF2UJQ2Btc
Exit mobile version