Aishwarya Rai: ఐశ్వర్య.. 12 ఏళ్లకే కూతురికి సర్జరీ చేయించిందా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rai: ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్. కానీ, ఇప్పుడు ఒక హీరోయిన్ సర్జరీ చేయించుకుంది అంటే అదంతా కామన్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ .. తన కూతురు ఆరాధ్యకు సర్జరీ చేయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐశ్వర్య.. అభిషేక్ ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. వీరికి ఆరాధ్య పుట్టింది. ఆమె పుట్టిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే.. ట్రెండ్ కాదు కానీ, వివాదాలు అని చెప్పాలి. ఐశ్వర్య, ఆరాధ్య ఎప్పుడు బయటకనిపించినా.. కూతురు చేయి పట్టుకొనే నడుస్తూ ఉంటుంది ఐశ్వర్య. కూతురుకు కనీసం ఫ్రీడమ్ కూడా ఇవ్వడం లేదా.. ? లేక ఆరాధ్యకు మైండ్ మెచ్యూరిటీ లేక అలా పట్టుకుంటుందా.. ? అనే విషయం ఎవరికి తెలియదు.
ఇక ఆరాధ్య.. తనకు ఊహ వచ్చినప్పటినుంచి ఒకటే హెయిర్ కట్ తో కనిపిస్తూ ఉంటుంది. ఫ్రింజ్ హెయిర్ కట్ అంటారు దాన్ని. వెనుక ఎంత పొడువు జుట్టు ఉన్నా.. నుదురు వరకు హెయిర్ ను కట్ చేస్తారు. దీనివలన పెద్దవారు కూడా చిన్న పిల్లలుగా కనిపిస్తారు. ఇక ఆరాధ్య ఎప్పుడు ఇదే హెయిర్ కట్ లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆరాధ్య హెయిర్ స్టైల్ మార్చడం.. బాలీవుడ్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఐశ్వర్య, ఆరాధ్య కలిసి వచ్చారు.అందులో ఆరాధ్య ఫ్రింజ్ హెయిర్ స్టైల్ తో కాకుండా నీట్ గా మధ్య పాపిడి తీసి.. పక్కకు హెయిర్ ను లీవ్ చేసింది. అంతేనా డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది. సడెన్ గా చూస్తే హీరోయిన్ అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ ఫోటోలను చూసి.. ఆరాధ్య టోటల్ గా మారిపోయింది. ఐశ్వర్య.. ఆమెకు సర్జరీ చేయించి ఉంటుంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. అయితే నిజానికి 12 ఏళ్లకే సర్జరీ చేయించారు అంటే నమ్మలేకుండా ఉన్నాం.. హెయిర్ స్టైల్, మేకప్ వలన ఆమె లుక్ మారింది తప్ప సర్జరీ లాంటివి ఏమి ఉండవేమో అని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ఏదిఏమైనా ఈ లుక్ లో ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలపై ఐశ్వర్య స్పందిస్తుందేమో చూడాలి.
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
- Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!