Site icon NTV Telugu

Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..

Ameer Khan

Ameer Khan

Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన నటంచిన తాజా మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ ప్రమోషన్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి స్పందించాడు. సినిమా జర్నీ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. సితారే జమీన్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా చేస్తాను.

Read Also : Opal Suchata : ప్రభాస్ గురించి మిస్ వరల్డ్ సుచాత కామెంట్స్.. ఆ సినిమాపై రివ్యూ ఇస్తుందట..

దాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. ఆ మూవీలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. దాన్ని చూపించాలంటే చాలా టైమ్ పడుతుంది. ఈ జనరేషన్ వాళ్లకు నచ్చేవిధంగా దాన్ని రూపొందించాలంటే భారీ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం మహాభారతం సినిమాలో నుంచి పుట్టిందే. ఆ మూవీ తర్వాత నేను సినిమాలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మూవీ తర్వాత నేను చేయడానికి ఇంకేమీ ఉండకపోవచ్చు అని హింట్ ఇచ్చారు అమీర్ ఖాన్. ఆయన మాటలను బట్టి చూస్తుంటే దీని తర్వాత కచ్చితంగా రిటైర్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Also : Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..

Exit mobile version