NTV Telugu Site icon

Aamir Khan: స్టార్ హీరో ఇంట పెళ్లి భాజాలు.. కూతురు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్!

aamir khan

aamir khan

Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న ఘనంగా జరిగింది. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్ తో ప్రేమను ఇరుకుటుంబాలు ఒప్పుకోవడంతో ఆ నిశ్చితార్థం జరిగింది. ఇక వీరి వివాహానికి సమయం ఆసన్నమైంది. 2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు అమీర్ ఖాన్ తాజాగా ప్రకటించారు.

Skanda – Peddha Kapu Sequels: స్కంద – పెద్ద కాపు సీక్వెల్స్ ఉంటాయా?

నేషనల్ న్యూస్ పోర్టల్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు అధికారికంగా స్పందించారు. ‘ఐరా జనవరి 3న వివాహం చేసుకోబోతోందని, అతడి పేరు నుపుర్, అతడు ఒక లవ్ లీ బోయ్ అని చెప్పుకొచ్చారు. ఐరా మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచి ఆమెకు తోడుగా, మద్దతుగా నిలిచిన వ్యక్తి అని వారు కలసి ఎంతో సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. వారు ఒకరి గురించిమరొకరు బాగా అర్ధం చేసుకున్నారని, వారు ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకోగలరు అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని పేర్కొన్న ఆయన అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పెళ్ళికి భారీ ఎత్తున ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.