బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ భావోద్వేగానికి గురయ్యారు . ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని మరి మాట్లాడానికి ప్రయత్నించారు. అయ్యో .. ఏమైంది.. ఎవరికైనా ఏదైన జరిగిందా అంటే.. అలాంటిదేం లేదు. అమీర్ తాజగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝండ్’ సినిమాను వీక్షించాడు. మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నేడు ప్రైవేట్ స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించిన అనంతరం అమీర్ భావోద్వేగానికి లోనయ్యారు. కళ్ల నిండా నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
“ఎంతో అద్భుతమైన సినిమా ఇది.. 20,30 ఏళ్లుగా మనం నేర్చుకున్నదానికి ఇది బ్రేక్ ఇస్తుంది. నాకు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఇందులోని పిల్లలు చాలా అద్భుతంగా నటించారు. అమితాబ్ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది” అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను టీ షర్ట్ తో తుడుచుకుంటూ చిత్ర బృందాన్ని ఆప్యాయంగా హత్తుకున్నారు. నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా పై అమీర్ లానే పలువురు ప్రముఖులు కూడా తమ స్పందన తెలియజేశారు.
