Site icon NTV Telugu

Aamir khan: అమిర్‌ ఖాన్‌ షాకింగ్‌ నిర్ణయం.. ఏకంగా అన్ని కోట్లు…

Aamir Khan

Aamir Khan

Aamir khan loose Rs 100crores: మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా అమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి చూస్తే హిందీలోకి డబ్ అయిన ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు భారీ మొత్తం పోగేసినట్టు ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ వర్షన్ మొదటి రోజు రూ. 11 కోట్లు పోగేయడానికే ఆపసోపాలు పడిందట. ఈ మొత్తం ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో అక్షరాలా సగం ఉందట.

మన సౌత్ సినిమాల్లో తప్పులు వెదుకుతూ పళ్లికిలించిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పుడు నాలుక్కరుచుకొని ‘తేలు కుట్టిన దొంగల్లా’ ఉన్నారు. అమిర్ ఖాన్ పైనే ఎంతోమంది బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ‘బాహుబలి’ సిరీస్ ను అమిర్ నటించిన ‘ దంగల్’ బీట్ చేసిందని టముకు వేశారు. కానీ, కొందరు బాలీవుడ్ క్రిటిక్సే ఇది నిజం కాదనీ తేల్చారు. అదలా ఉంచితే, హిందీలో టాప్ టెన్ గ్రాసర్స్ లో ఆమిర్ ఖాన్ నటించిన రెండు చిత్రాలు ‘దంగల్, పీకే’ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమిర్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తుందని బాలీవుడ్ బాబులు ఆశించారు. కానీ, మొదటి రోజునే వారి ఆశలపై ‘లాల్ సింగ్ చడ్డా’ నీళ్ళు చల్లడం గమనార్హం.

అయితే.. ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ ఖాన్‌ ఇప్పుడు మరో నష్టాన్ని తన భుజాలపై వేసుకున్నారు. దీంతో.. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ వదులుకోనున్నారు. ఇక ‘లాల్‌ సింగ్ చడ్డా’ మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు కాగా ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో..ఈ సినిమా కోసం గత నాలుగేళ్లుగా వేరే ఏ చిత్రాన్నీ అమిర్‌ అంగీకరించలేదు..విక్రమ్‌ వేద లాంటి సినిమాలను సైతం వదులుకున్నారు. ఆగస్టు 11న విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యింది. ఇప్పుడు ఆ చిత్రం మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి ఆమిర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకుగానూ అమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు కాగా.. ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నాడు. అమీర్ ఖాన్ ఈనిర్ణయంతో లాల్‌ సింగ్‌ చడ్డా చిత్రంపై మొత్తం రూ.100కోట్ల నష్టం వచ్చిందని టాక్.
Astrology : సెప్టెంబర్‌ 1, గురువారం దినఫలాలు

Exit mobile version