Site icon NTV Telugu

Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..

Ameerrkhan

Ameerrkhan

Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి నుంచో అభిమానం అంటూ తెలిపాడు.

Read Also : Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

నేను మణిరత్నం గారి సినిమాలకు అభిమానిని. చాలా సార్లు ఆయనతో కలిసి పనిచేయాలి అనుకున్నాను. చెన్నై వచ్చినప్పుడల్లా ఆయన్ను కలుస్తుంటాను. ఎన్నో సార్లు మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకున్నాం. ఇద్దరి కాంబోలో ‘లజో’ అనే మూవీ కూడా అనుకున్నాం. కానీ అనుకోని కారణాలతో అది చేయలేకపోయాం.

కానీ ఎన్నిటికైనా మణిరత్నం గారితో మూవీ చేయాలని ఉంది. అది భవిష్యత్ లో నెరవేరుతుందనే ఆశ నాకుంది. ఆయన మంచి విజనరీ. ఎలాంటి సినిమాలను అయినా చాలా బ్యాలెన్స్ చేయగలరు’ అంటూ అమీర్ ఖాన్ తెలిపాడు. ఇక మణిరత్నం రీసెంట్ గా చేసిన థగ్ లైఫ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది.

Read Also : Shobana : చెట్టు వెనక బట్టలు మార్చుకోవాలన్నారు.. నటి శోభన షాకింగ్ కామెంట్స్..

Exit mobile version