Site icon NTV Telugu

Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కి షాక్ ఇచ్చిన అభిమాని

Tharun Bhaskar

Tharun Bhaskar

అభిమానికి షాక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్‌, అదేంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఫెవరెట్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ చేత అన్‌బాక్స్ చేయించారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు ఆగమ్ బా. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం ఎదురుచూస్తూ దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదురుచూశారు.

Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం

తరుణ్ భాస్కర్ సన్నిహిత మిత్రుడు కౌశిక్ ద్వారా ఆయన బర్త్ డే పార్టీకి వెళ్లడం, అక్కడ ఇలా సర్ ప్రైజింగ్‌గా తరుణ్ భాస్కర్ తో తన గోల్డ్ ప్లే బటన్‌ను ఆవిష్కరింపజేయడంతో సదరు యూట్యూబర్ సంతోషంలో తేలిపోయాడు. తరుణ్ భాస్కర్ నటించిన కీడ కోలాలోని నాయుడు పాత్రకు సంబంధించిన లుక్‌లో ఈ యూట్యూబర్ దర్శనం ఇచ్చాడు. అంటే తరుణ్ భాస్కర్ అంటే అతనికి ఎంత ఇష్టం అనేది ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ స్వయంగా వేదికపై గోల్డ్ ప్లే బటన్‌ను అన్‌బాక్స్ చేసి అతడి కృషి, పట్టుదలను అభినందించారు.

Exit mobile version