Site icon NTV Telugu

“బ్లాక్” టీజర్… ఆది సాయికుమార్ మరో థ్రిల్లర్

Aadi Saikumar's Black Movie Teaser

ఆది సాయికుమార్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్”బ్లాక్‌”తో బిజీగా ఉన్నారు. ఈ కాప్ బేస్డ్ డ్రామాకు జిబి కృష్ణ దర్శకత్వం వహించారు. మహంకాళి దివాకర్ తన హోమ్ బ్యానర్ మహంకాళి మూవీస్ పై నిర్మిస్తున్నారు. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో “బిగ్ బాస్” ఫేమ్ కౌశల్ మండా, ఆమని, శ్యామ్ కృష్ణ, సూర్య, చక్రపాణి, వెన్నెల కిషోర్, విశ్వేశ్వర్ రావు, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. “బ్లాక్” మూవీ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.

Read Also : కరణ్ సమక్షంలో అరుణిత, పవన్ దీప్ ‘సెమీ ఫైనల్’ రొమాన్స్!

ఇందులో ఆది పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఆది ఖాకీ యూనిఫామ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి. ఈ రోజు ఉదయం మేకర్స్ “బ్లాక్” టీజర్‌ను రిలీజ్ చేశారు. యంగ్ హీరో సుధీర్ బాబు ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్‌లో ఆది నిజాయితీ గల పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. అతను ఒక నేరస్థుడిని కనిపెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. టీజర్లో సన్నివేశాలు, డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. “బ్లాక్” సినిమా పూర్తయ్యే దశలో ఉంది. త్వరలో విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారు. ఉత్కంఠభరితంగా ఉన్న ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version