Site icon NTV Telugu

Aadi Saikumar : నయా మూవీ షురూ!

Aadi Sai Kumar

Aadi Sai Kumar

సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని వైవిధ్యమైన కథతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు శశికాంత్ చెబుతున్నారు.

Read Also : Tollywood : ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు!

పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా” లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version