NTV Telugu Site icon

Aadi Sai Kumar: కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసిందొచ్…

Aadi Sai Kumar

Aadi Sai Kumar

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వాలి అనే కోరిక పుట్టిందో లేక వేరే కథలు తన దగ్గరికి వెళ్లడంలేదో తెలియదు కానీ యాక్షన్ సినిమాల వైపు వచ్చి ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఆది సాయి కుమార్, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. 2022లో ఆది సాయి కుమార్ అయిదు సినిమాలు నటించాడు, ఇందులో ‘అతిధిదేవోభవ’ సినిమా మాత్రమే కాస్త జనాలకి తెలిసింది. మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో 2022 ఇచ్చిన బ్యాడ్ టైంని బ్రేక్ చేస్తూ హిట్ ట్రాక్ ఎక్కడానికి మార్చ్ 10న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.

CSI సనతాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్న ఆది సాయి కుమార్, ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. గోపీచంద్ మలినేని లాంచ్ చేసిన CSI సనతాన్ ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. విక్రమ్ అనే బిజినెస్ మాన్ ని ఎవరో మర్డర్ చేస్తే ఆ కేసు ఎంక్వయిరీ చేస్తున్న పోలిస్ పాత్రలో ఆది సాయి కుమార్ కనిపించాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం అట్రాక్టివ్ గా ఉంది. ట్రైలర్ లో ప్లే చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. మర్డర్ చెయ్యబడిన విక్రమ్ పాత్రలో తారక్ పొంన్నప నటిస్తుండగా, నందినీ రాయ్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. శివ శంకర్ దేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ CSI సనతాన్ సినిమాతో అయినా ఆది సాయి కుమార్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

CSI Sanatan Trailer | Aadi Sai Kumar , Misha Narang | Sivashankar Dev |  Aneesh Solomon