Site icon NTV Telugu

Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్

Adi-and-Nikki-Galrani

Aadhi and Nikki Galrani ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులుగా మారబోతున్నారు. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ నిక్కీ గల్రాని షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా, తాజాగా వీడియోను విడుదల చేశారు ఈ జంట. మార్చి 24న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాని, నీరజ కోనతో పాటు పలువురు సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ వేడుకలో భాగమయ్యారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో నిక్కీ తమ ఎంగేజ్‌మెంట్ వీడియోను అభిమానులు కోసం షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్కీ, ఆది చాలా సంతోషంగా ఉన్నారు. కాగా ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రాని ఎమోషనల్ అయ్యింది. ఆది ఆమె కన్నీళ్లు తుడుస్తూ కన్పించాడు.

Read Also : SDT15 : బ్యాక్ టు సెట్స్… కన్నీటి పర్యంతమైన సాయి తేజ్

మొత్తానికి వీరిద్దరి పెళ్లి టాపిక్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. కానీ వీరిద్దరి పెళ్ళి ఎప్పుడు అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ఆది, నిక్కీ యాగవరాయినుం నా కాక, మలుపు, మరగధ నానయం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత వీరిద్దరి చిగురించిన ప్రేమ పెళ్లి వరకూ దారి తీసింది.

Exit mobile version