యంగ్ హీరో శర్వానంద్, హాట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోరె తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్య, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ని బట్టి మంచి కుటుంబ కథా చిత్రంగా తెలుస్తోంది. ఐదుగురు ఆడవాళ్ల ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగిన కుర్రాడు చిరు.
వయసొచ్చాకా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటాడు. కానీ ఇంట్లో ఉన్న ఆడవారి వలన ఒక్క సంబంధం కూడా కుదరదు. దీంతో విసిగిపోయిన చిరు ఇంట్లో ఆడవారిపై కోపంగా ఉంటాడు. అంతలోనే అతడి లైఫ్ లోకి ఆద్య ఎంటర్ అవుతోంది. అయితే ఆధ్య వాళ్ళ అమ్మకు ఆమెకు పెళ్లి చేయాలని ఉండదు. దీంతో ఆద్యను పెళ్లి చేసుకోవాలంటే ఇల్లరికం రమ్మని షరతు పెడుతోంది వాళ్లమ్మ .. అమ్మ మాటే తన మాట అని అంటోంది ఆధ్య.. ఇక ఇల్లరికానికి చిరు కుటుంబం ఒప్పుకోదు. మరి చివరికి ఆధ్య, చిరు లు కలిశారా..? ఇల్లరికం చిరు వెళ్లాడా..? అస్సలు పెళ్లి చేసుకోకుండా ఆ ఇంట్లో ఐదుగురు ఆడవాళ్లు ఎందుకు ఆలా ఉండిపోయారు అనేది ట్విస్ట్ గా చూపించారు. చిరుగా శర్వా, ఆధ్య గా రష్మిక కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంది. శర్వా తల్లిగా రాధిక, రష్మిక తల్లిగా ఖుష్బూ కనిపించారు. ట్రైలర్ లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కనిపించడంతో కామెడీ ఒక రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది. పెళ్లి కోసం తిప్పలు పడే యువకుడిగా శర్వా కడుపుబ్బా నవ్వించాడు. దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చారు మేకర్స్. మరి మార్చి 4 న ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
