Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఏపీ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది. ఈ పెంపుతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కుతాయని మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు మొత్తం పది రోజుల పాటు ఈ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. మల్టీప్లెక్స్‌లలో ప్రతి టికెట్‌పై రూ.75 వరకు అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ లభించింది. దీంతో పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.252 వరకు ఉండనుంది. సింగిల్ స్క్రీన్లలో సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 చొప్పున పెంచుకోవచ్చు. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ.197.50 గా ఉంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తుండగా, తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. చాలా కాలం తర్వాత వెంకీ-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో, పెరిగిన రేట్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.

