Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!

Aadarsha Kutumbam 300kb

Aadarsha Kutumbam 300kb

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగం పెంచుతూ ఫస్ట్ సింగిల్ పై ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుండి మొదటి సింగిల్ ‘నారాయణమ్మ’ సాంగ్ రేపే (2026 సెప్టెంబర్ 22న) విడుదల కాబోతోంది. ఇవాళే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ అదిరిపోయే అప్‌డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్స్ తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న  సినిమా కావడంతో ఈ ఫస్ట్ సింగిల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ క్రేజీ సాంగ్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించారు. రేపు రాబోతున్న ‘నారాయణమ్మ’ సాంగ్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అని, ఇది థియేటర్లలో వింటేజ్ వెంకటేష్ మార్క్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం థమన్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్స్‌తో గట్టి ప్లాన్ వేశారని, ఈ ఒక్క పాటతోనే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడబోతోందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికే.. అంటే గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో దసరా సీజన్‌లో వెంకటేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. మరి రేపు విడుదల కానున్న ‘నారాయణమ్మ’ మాస్ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.