Site icon NTV Telugu

Star entertainer : సక్సెస్‌ఫుల్‌ హీరోనే.. కానీ రేస్ లో వెనుకపడిపోయాడు

Naveen Polishetty

Naveen Polishetty

లేటైనా ఫర్వాలేదు. టిక్కెట్‌ కొన్న ప్రేక్షకుడిని శాటిస్‌ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్‌ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్‌ అయిన నవీన్‌ అన్నీ తానై నడిపిస్తూ వుంటాడు.దీంతో సినిమా సినిమా మధ్య చాలా గ్యాప్‌ వచ్చేస్తోంది. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్‌కు రెడీ అవుతుండగా నవీన్‌కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాదిగ్యాప్‌ వచ్చింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ పూర్తిచేసే పనిలో వున్నాడు.

Also Read : Thammudu : తమ్ముడు ఓవర్శీస్ రివ్యూ..

‘అనగనగా ఒక రాజు’ మూవీలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ‘ప్రీ వెడ్డింగ్‌ టీజర్‌ ప్రోమో ను రిలీజ్‌ చేశారు. టైటిల్లో ఈ కమెడియన్‌ హీరోకు ‘స్టార్‌ ఎంటర్‌టైనర్‌’ అన్న బిరుదు పెట్టారు మేకర్స్‌. సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఒక సినిమా తర్వాతే మరో మూవీ గురించి ఆలోచించే నవీన్‌ మనసు మార్చుకుని నెక్ట్స్‌ మూవీ స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టాడు. డిటెక్టీవ్‌గా నవీన్‌ పేరు తీసుకొచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్‌ పనిలో వున్నాడట. ఫస్ట్‌ పార్ట్‌ తీసిన స్వరూప్‌ దర్శకత్వంలోనే సీక్వెల్‌ వుంటుంది. యంగ్ హీరోలందరూ ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తుంటే రెండేళ్లకో సినిమాతో వస్తున్న నవీన్‌ కెరీర్‌లో వెనుకపడిపోయాడు. అనగనగా ఒక రాజు రిలీజైన వెంటనే  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మొదలుపెట్టే ఛాన్స్‌ వుంది.  ఇలా రెండేళ్లకో సినిమా చేస్తూ వెళ్లి  ఐదారు సినిమాలకే రిటైర్‌ అయ్యేలా ఉన్నాడు. మిగిలిన యంగ్ హీరోలలాగా నవీన్ పోలిశెట్టి కూడా జెట్ స్పీడ్ అందుకోవాలి. అదే టైమ్ లో కథల పట్ల జాగ్రత్త గా వ్యవహరిస్తే స్టార్ హీరోకు వెళ్లడం మ్యాజిక్ ఏమి కాదు.

Exit mobile version