NTV Telugu Site icon

Salaar: ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Yash In Salaar

Yash In Salaar

A Star Hero Playing Guest Role In Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. రెండు భాగాల్లో ఈ సినిమా రూపొందుతుండగా.. ప్రస్తుతం తొలి భాగం చిత్రీకరణ జరుగుతోంది. కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బాహుబలితో దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన ప్రభాస్ కాంబోలో ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుండటంతో.. భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసే మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఇంతకీ.. అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. కేజీఎఫ్ స్టార్ యశ్.

Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ ఎందుకు చంపాడంటే?.. అదే కారణం

తాను తీస్తున్న సినిమాలతో ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త యూనివర్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని నిర్మాతలు ఇదివరకే వెల్లడించారు. ఇందులో భాగంగానే సలార్‌లో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడని సమాచారం. ఇదివరకే ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ.. ఇప్పుడు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. సలార్‌లో యశ్ తప్పకుండా కనిపిస్తాడని కన్నడ వర్గాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. సినీ ప్రియులకు పండగే! ఇద్దరూ పాన్ ఇండియన్ స్టార్స్ కాబట్టి.. ఈ చిత్రానికి తారాస్థాయిలో క్రేజ్ వచ్చిపడటం ఖాయం.

Naatu Naatu: ఆస్కార్ బరిలో “నాటు… నాటు…” సందడి!

కాగా.. సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ చిత్రాన్ని రెండు భాగాల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్, కటౌట్‌కి తగ్గట్టు.. దర్శకుడు ప్రశాంత్ దీనిని యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.