‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్ భీమ్ గా చరణ్ ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న స్క్రిప్ట్, డైరెక్షన్ లో రాజమౌళి బ్రిలియన్స్ ఇవ్వన్నీ కలిపి ఆర్ ఆర్ ఆర్ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. మూడు గంటల పాటు గూస్ బంప్స్ ఇచ్చే మన సినిమాని ఆస్కార్ రేస్ లో నిలుపుతున్నట్లు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. రోడ్ టు ఆస్కార్ జర్నీకి మంచి జోష్ తెస్తూ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ని రాజమౌళి గెలుచుకున్నారు. దీంతో ఇండియాలో ఆస్కార్ ఆశలు కాస్త ఎక్కువగానే చిగురిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఒకవేళ ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయితే క్యాంపెయిన్ కోసం డీవీవీ దానయ్య ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? ‘P&A (ప్రింట్స్ అండ్ అడ్వర్టైజింగ్)’ కోసం ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? అవును, ఏదైనా సినిమా ఆస్కార్ ని నామినేట్ అయితే… ఆస్కార్స్ కోసం సెపరేట్ పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది, ప్రెస్ మీట్స్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది, అక్కడి ఫిల్మ్ మేకర్స్ కి, సెలెక్టివ్ ఆడియన్స్ కి షో వేయాల్సి ఉంటుంది. గతంలో అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ‘పారసైట్’ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం 5 మిలియన్ డాలర్స్ స్పెండ్ చేసింది, P&A కోసం ఓవరాల్ గా 17 నుంచి 18 మిలియన్ డాలర్స్ ని స్పెండ్ చేసింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విసారనై(2015) సినిమా 89th అకాడెమీ అవార్డ్స్ కి ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయ్యింది కానీ నామినేట్ అవ్వలేదు. కేవలం సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడానికి అవసరమైన క్యాంపెయిన్ కోసమే… సినిమా బడ్జట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టామని వెట్రిమారన్ చాలా సార్లు చెప్పాడు. విసారనై ప్రొడ్యూసర్ అయిన హీరో ధనుష్ ఖర్చు వెనకాడకుండా ప్రమోషన్స్ చేశాడు కానీ సినిమా మాత్రం ఆస్కార్ ని నామినేట్ అవ్వలేదు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ని నామినేట్ అయితే లీస్ట్ కేస్ లో ప్రొడ్యూసర్స్ 50 నుంచు 80 కోట్ల వరకూ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. తన సినిమా వరల్డ్ ఆడియెన్స్ ని రీచ్ అవుతుంది అంటే, అది తన నెక్స్ట్ సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళే రాజమౌళి… ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ స్టేజ్ పైన నిలబెట్టడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడే ప్రసక్తే లేదు.