సుహాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ఓ భామ అయ్యో రామ. మలయాళ కుట్టీ.. మాళవిక మనోజ్ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అవుతోంది. తమిళ్ హిట్ మూవీ జోలో సైలెంట్‌గా కనిపించిన భామ.. ఇందులో వయెలెంట్ క్యారెక్టర్ చేస్తుందని టీజర్ చూస్తేనే అర్థమౌతుంది. రీసెంట్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మేకర్స్. జులై 11న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. అయితే అదే డేట్ కు అనుష్క ఘాటీ కూడా రిలీజ్ అవుతుంది. ఘాటీ మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎప్పుడో ప్రకటించగా ఇప్పుడు ఈ రేస్ లోకి ఓ భామ అయ్యోరామ వచ్చి చేరింది.
Also Read : Suriya45 : సూర్య – ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ ఇదే
ఘాటీలాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్టుతో ఈ సినిమా పోటీకాదుకానీ.. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలతో పోటీగా సక్సెస్ కొడుతున్న నేపథ్యంలో ఓ భామ అయ్యో రామ టీం డేర్ చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఘాటీ నుండి గ్లింప్స్ తప్ప మరో అప్డేట్ లేదు. సినిమా రిలీజ్‌కు గట్టిగా నెల రోజులు కూడా లేదు. కానీ టీజర్ కానీ.. ట్రైలర్, ఎట్ లీస్ట్ సాంగ్ కానీ వదల్లేదు. కానీ ఓ భామ అయ్యో రామ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ వచ్చేశాయి. ఘాటీ కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను నేడు రిలీజ్ చేస్తోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. మరి రెండు సినిమాలలో ఎవరు విజేతలుగా నిలుస్తారో వచ్చే నెల 11న తెలుస్తుంది.
