NTV Telugu Site icon

A.S. Ravi Kumar Chowdary: ఏరా.. గోపీచంద్.. అంత బలిసిందారా నీకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Gopcihand

Gopcihand

A.S. Ravi Kumar Chowdary: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడు పొగిడినావారే.. అవకాశాలు లేనప్పుడు తిట్టిపోస్తారు. హీరోగా.. ఛాన్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ప్లాపుల్లో ఉన్నాడని.. ఒక్క హిట్ కూడా లేని హీరో.. ఆ ప్లాప్ డైరెక్టర్ ను నమ్మి మరో ప్లాప్ ను మూట కట్టుకోవడం ఇష్టంలేని ఒక హీరోపై సదురు ప్లాప్ డైరెక్టర్ ఎంతో నీచంగా మాట్లాడాడు. నిన్ను హీరోను చేసింది నేనే.. అలాంటింది నిన్ను కలవడానికి నేను ఇప్పుడు ఐదుగురును దాటుకొని రావాలారా.. నీకు బాగా బలిసిందిరా అంటూ నిస్సంకోచంగా ఇంటర్వ్యూలో చెప్పడం ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇంతకు ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు.. ? హీరో ఎవరు.. ? అంటే.. యజ్ఞం సినిమాతో గోపీచంద్ ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ AS. రవి కుమార్ చౌదరి.

Jailer : జైలర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

దాదాపు పదేళ్ల తరువాత ఈ డైరెక్టర్.. తిరగబడరా సామీ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలకృష్ణతో వీరభద్ర లాంటి భారీ పరాజయాన్ని అందుకున్నాక.. అవకాశాల కోసం తాను హీరోగా పరిచయం చేసిన గోపీచంద్ దగ్గరకు వెళ్లి ఛాన్స్ అడిగితే.. తనను వెయిట్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మధ్యనే హీరోయిన్ మన్నార్ చోప్రాను పబ్లిక్ గా ముద్దుపెట్టిన వివాదంలో రవి కుమార్ పేరు మారు మ్రోగిపోతున్న విషయం తెల్సిందే. ఆ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి చేసిన ఇంటర్వ్యూలోలో గోపీచంద్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు రవి కుమార్.

Liquor sales: జైలర్ కలెక్షన్స్ ను కూడా చిత్తు చేసిన మందు బాబులు.. 8 రోజుల్లో అన్ని వందల కోట్లు తాగేశారా?

” వాడిని హీరోను చేసింది నేనే.. ఒకప్పుడు విలన్ వేషాలు వేసుకొని బతికేవాడు.. మాతో కలిసి చెట్టు కింద కలిసి తినేవాడు.. ఏరా .. ఇప్పుడు నీకు బాగా బలిసింది కదా.. నిన్ను నేను చూడాలంటే ఐదుగురును దాటుకొని రావాలా.. ? .. గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్ .. ఇప్పుడు నేను వచ్చాను అని చెప్తే.. వెయిట్ చేయమని చెప్తావా.. ?. ఒకప్పుడు నా సినిమాతో ఎదిగినవాడు ఇప్పుడు బలుపు ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. వాడు ఎదురైనా ఇలాగే మాట్లాడతా.. ?. ముఖం మీద మేకప్ వేసుకున్నాకా.. మేకలాంటి చేష్టలు చాలామందికి ఉంటాయి. ఇది కోపం, ఆగ్రహం కాదు.. ఆవేదన” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవికుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.