Raviteja: బాలయ్య నో చెప్పిన కథతోనే రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని ఊహించడం కష్టమే. రియల్ లైఫ్ లో కూడా బ్రదర్స్ లా ఉండే రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇదే మాస్ హిస్టీరియాని మరోసారి క్రియేట్ చేయడానికి రవితేజ-గోపీచంద్ మలినేని రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. థమన్-రవితేజ… థమన్-గోపీచంద్ మలినేని… థమన్-గోపీచంద్ మలినేని-రవితేజలది సూపర్ హిట్ కాంబినేషన్… అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడానికి ఈ కాంబో రెడీ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బయట వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని, బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసాడు. 2023 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రెగ్యులర్ ఫ్యాక్షన్ జానర్ లో ఉండే ఈ సినిమా కన్నా ముందు గోపీచంద్ మలినేని బాలయ్యకి ఒక్క రోజులో జరిగే కథ ఒకటి చెప్పాడు. అయితే తన నుంచి ఆడియన్స్ లార్జర్ స్పాన్ ఉన్న కథని ఆశిస్తారని బాలకృష్ణ చెప్పడంతో గోపీచంద్ మలినేని ఆ కథని పక్కన పెట్టి వీరసింహా రెడ్డి సినిమా చేసాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిలు ఒక వేదికపై రివీల్ చేసారు. అప్పుడు బాలయ్య రిజెక్ట్ చేసిన కథతోనే గోపీచంద్ మలినేని-రవితేజల సినిమా రూపొందుతుందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇది ఎంతవరకూ నిజమనే విషయం గోపీచంద్ మలినేనికి మాత్రమే తెలియాలి. ఇప్పటికైతే సెట్స్ పైకి వెళ్లడానికి గోపీచంద్ మలినేని పక్కా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!