Site icon NTV Telugu

August 16, 1947: గౌతమ్ కార్తీక్ తో ఎ.ఆర్. మురుగదాస్ హిస్టారికల్ మూవీ!

1947

1947

Gautham Karthik: తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ నిర్మాత కూడా! తన శిష్యుల దర్శకత్వంలో మురుగదాస్ పలు అర్థవంతమైన చిత్రాలను ఇప్పటికే నిర్మించారు. ఎ.ఆర్. మురుగదాస్ ప్రొడక్షన్ నుండి వస్తున్న మరో చిత్రం ‘ఆగస్ట్ 16, 1947’. గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మన దేశ స్వాతంత్ర్యం గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పని షాకింగ్ స్టోరీతో ‘ఆగస్ట్ 16, 1947’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఏప్రిల్ 7న ‘ఆగస్ట్ 16, 1947’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు బుధవారం నిర్మాతలు వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను స్వాతంత్రం వచ్చిన సమయానికి ఈ సినిమా తీసుకు వెళ్తుందని, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ సరసన రేవతి నటించారు. కథానాయకగా ఆమెకు తొలి చిత్రమిది. లెజెండరీ కమెడియన్ పుగళ్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలోని ఒక పల్లెటూరిలో జరిగే కథతో రూపొందించిన హిస్టారికల్ సినిమా ‘ఆగస్ట్ 16, 1947’ అని తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహ నిర్మాత.

Exit mobile version