NTV Telugu Site icon

SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’గా మహేష్ బాబు?

Ssmb 28

Ssmb 28

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ కాస్త చల్లబడగానే.. తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిరాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌లో జాయిన్ మహేశ్ అవనున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు కొన్ని యాక్షన్ బ్లాక్ షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాక్సాఫీస్‌ను హెచ్చరించేలా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినా కూడా సినిమా టైటిల్ ని మాత్రం అనౌన్స్ చెయ్యకుండా దాచిపెట్టారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రొడ్యూసర్ నాగ వంశీ. SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ కూడా మే 31నే రానుంది. ఇప్పటికే ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు.

మే 31న అఫీషియల్ అనౌన్స్మెంట్ విషయం పక్కన పెడితే SSMB 28 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌తోనే టైటిల్స్ పెడతాడని, కొన్ని టైటిల్స్ ని కూడా వైరల్ చేశారు ఫాన్స్. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు లాంటి టైటిల్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది కానీ ఇంత సాఫ్ట్ టైటిల్ ని ఫిక్స్ చేయ్యరులే అనుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్‌నే దాదాపుగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మే 31 వరకూ ఆగాల్సిందే.