Site icon NTV Telugu

Suku Poorvaraj: ఆకట్టుకుంటున్న ‘ఏ మాస్టర్ పీస్’ మూవీ లుక్

A Master Piece

A Master Piece

‘A Master Piece’: “శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుకు పూర్వాజ్. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా హీరో సూపర్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తమ సూపర్ హీరో ఎలా ఉండబోతున్నాడో, తను ఎలా చూపించబోతున్నాడో ఒక్క పోస్టర్ తో చెప్పాడు దర్శకుడు. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోను మన తెలుగు ప్రేక్షకులకు కూడ పరిచయం చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించబోతున్నామని దర్శకుడు తెలిపాడు.

త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని, జనవరి 26 నుండి ఫిబ్రవరి 10 వరకు అరకులో మొదటి షెడ్యూల్, ఫిబ్రవరి 18 నుండి మార్చి 30 వరకు రెండవ షెడ్యూల్, కులుమనాలిలో ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకూ చివరి షెడ్యూల్ పూర్తి చేయనున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఇందులో అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహా గుప్త తదితరులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.

Exit mobile version