Site icon NTV Telugu

Sarkaru Vaari Paata : మహేష్ మాస్ తాండవం.. అరాచకం అంటున్న ఫ్యాన్స్

mahesh

mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.  ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి ఫస్ట్ సింగిల్ కూడా సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజగా నేడు మహాశివరాత్రి కారణంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్ సినిమాలోని సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో స్టిల్ గా కనిపిస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.  మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ మాస్ ఫైట్ అరాచకం అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిత్రంతో మహేష్ మరో హిట్ ని తన ఖాతలో వేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version