NTV Telugu Site icon

Sri Devi: తనకు చాలా అన్యాయం జరిగింది.. శ్రీదేవి పై స్టార్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్..?

Sri Devi

Sri Devi

ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస‌ హిట్‌లతో దూసుకుపోయిన సీనియర్ డైరెక్టర్ బాపయ్య . తెలుగులో సోగ్గాడు , మండే గుండెలు , నా దేశం, ముందడుగు వంటి గొప్ప సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో చెవిచూసిన అనుభవాలను పంచుకున్నాడు. అంతే కాదు అతిలోక సుందరి శ్రీదేవి డెత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

బాపయ్య మాట్లాడుతూ .. ‘టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారు చాలా తక్కువ .. కానీ నేను మాత్రం వరుస‌ విజయాలు అందుకున్న. అప్పట్లో స్టార్ హీరోలు వారి సినిమాల గురించి నా దగ్గర ఎన్నో సలహాలు తీసుకొనేవారు. షూటింగ్ విషయంలో నేను చాలా స్టిక్ గా ఉండేవాడిని.. అందుకే హీరోయిన్లు నన్ను బ్రేక్ అడగ‌డానికి ఎంతో ఇబ్బంది పడేవారు. నా దర్శకత్వంలో శ్రీదేవి 14 సినిమాలు వరకు నటించింది. తనతో నా జర్ని ఎప్పటికి మర్చిపోలేను. నన్ను బాపుజి అని పిలిచేది. నిర్మాత బోనీకపూర్ ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటిది ఒక సారి గా తన మరణ వార్త ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. అందరి గుండెలో అది పిడుగులాంటి వార్త. ఆమె మరణం మాత్రం సహజమైంది కాదని కొందరు అన్నారు. నిజంగానే కొన్ని విషయాలో ఆమెకి చాలా అన్యాయం జరిగింది’ అని బాపయ్య తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.