స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రికార్డింగ్ స్టూడియోలో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఉన్న “The Panchathan Record Inn and AM Studios”లో లైట్ బిగిస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో లైట్ మెన్ కూమార్ మృతి చెందాడు. ఈ ఘటనలో లైట్ మెన్ చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Custody: ‘రేవతి’గా మారిన బేబమ్మ… కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లింది?
ఇక రెహమాన్ సినిమాల విషయానికి వస్తే గ్రామీ, ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా రెహమాన్ చరిత్రకెక్కాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు. ఈ మూవీలో రెహమాన్ కంపోజ్ చేసిన ‘జై హో’ సాంగ్ ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ టీమ్స్ కి విక్టరీ స్లోగన్ అయ్యింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి రెహమాన్ లాగే కీరవాణి కూడా ఇండియాకి ఆస్కార్ తీసుకోని వస్తాడేమో చూడాలి.
Read Also: Balakrishna : ఎన్టీఆర్ పొలిటికల్ హీరో.. నివాళులర్పించిన బాలయ్య
