పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫాన్స్ అందరికీ షాక్ ఇస్తూ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. హారర్ టచ్ ఇస్తూ, మారుతీ మార్క్ ఫన్ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ నుంచి అప్డేట్ బయటకి రాలేదు కానీ ఒక లీక్ బయటకి వచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చెక్స్ షర్ట్ వేసుకోని రగ్గడ్ లుక్ లో, ఫుల్ బియర్డ్ తో ప్రభాస్ ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. లీక్ అయిన ఫోటోలో ప్రభాస్ పక్కనే రిద్దీ కుమార్ కూడా ఉండడం విశేషం.
సెట్స్ నుంచి కెమెరా దగ్గరే ఉండి చిత్ర యూనిట్ నుంచే ఎవరో లీక్ చేసినట్లు ఉన్న ఫోటో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ రిద్దీ కుమార్ గతంలో ప్రభాస్ పక్కన రాధే శ్యామ్ సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రభాస్ ఫాన్స్ కి చెడు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరి మారుతీ ఆ విషయం తెలిసి కూడా రిద్దీ కుమార్ ని ఎందుకు తీసుకున్నాడు, అసలు ఈమె ఎందుకు వచ్చింది అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రిద్దీ కుమార్ ని పక్కన పెడితే ప్రభాస్ మాత్రం ఈ లీక్డ్ ఫోటోలో మస్త్ ఉన్నాడు. మారుతీ కరెక్ట్ గా సినిమా చెయ్యాలే కానీ ప్రభాస్ లుక్ కోసమే థియేటర్స్ కి వెళ్లే ఫాన్స్ ఉంటారు. మరి లీక్ బయటకి వచ్చేసింది కాబట్టి ఇక లేట్ చెయ్యకుండా మేకర్స్ అఫీషియల్ గా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
