మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ సమస్యలపై చర్చించారు.
Read Also : “పుష్ప” వీడియో లీక్… పోలీసులను ఆశ్రయించిన మైత్రి నిర్మాతలు
సిని ప్రముఖులను మెగాస్టార్ స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, డి సురేష్ బాబు, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. బి, సి సెంటర్స్ లో టిక్కెట్ రెట్లు, విద్యుత్ టారిఫ్, సిని కార్మికులకు, థియేటర్ కార్మికుల, పలు సమస్యలపై సినీ పెద్దలు చర్చించారు.
