A Journey To Kasi: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మనమే: శేఖర్ సూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Journey To Kasi: చైతన్యరావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణంగా మునికృష్ణ దర్శకత్వంలో కె.పి. లోకనాథ్, దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి నిర్మించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. జనవరి 6 న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ సూరి మాట్లాడుతూ “ఈ మూవీ టైటిల్ చాలా బాగుంది. కాశీతో నాకు మంచి అనుబంధం ఉంది. 2014లో ఓ సినిమా షూటింగ్ కోసం నేను కాశీలో 60 రోజులు ఉన్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉందనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. శుద్ధోసి బుద్ధోసి పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి కథను ఎంచుకున్న దర్శకుడు, నిర్మాతలకి నా కృతజ్ఞతలు. ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ తిరుపతి రెడ్డి నా చిత్రాలకి పని చేశారు. మంచి టెక్నీషియన్” అని తెలిపారు.
‘శుద్ధోసి బుద్ధోసి..’ పాట పడిన సింగర్ గోమతి అయ్యర్ మాట్లాడుతూ “ఈ పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ గారికి, చిత్ర యూనిట్ సభ్యులకి నా కృతఙ్ఞతలు. ఈ చిత్రం మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు. సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఒక తెలుగు పాట, ఒక సంస్కృత గీతంతో పాటు ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాను. ఇలాంటి మంచి చిత్రంలో పని చేయటం గర్వంగా ఉంది. చైతన్యరావ్ చాలా బాగా నటించారు. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది” అని తెలిపారు. హీరోయిన్ కేటలిన్ గౌడ మాట్లాడుతూ “ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. చాలా మంచి సినిమా. కుటుంబ సభ్యులు అందరు కలిసి చూసే చిత్రం. దర్శకుడు మునికృష్ణ గారు చాలా దీనిని తెరకెక్కించారు” అని అన్నారు. దర్శకుడు మునికృష్ణ మాట్లాడుతూ ” ‘ఏ జర్నీ టు కాశీ’ చిత్రం కాశీయాత్రకు సంబంధించిన కథ. కాశీ బ్యాక్ డ్రాప్ లోని ఒక కుటుంబం కథ. ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ డ్రామాగా, ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం” అని అన్నారు. ఈ చిత్రాన్ని చూసి ఆదరించాల్సిందిగా నిర్మాతల్లో ఒకరైన దొరడ్ల బాలాజీ కోరారు.
Also Read
- Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
- Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!