WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి పవన్ తేరి రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. WeDontWantTheriRemake అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఒక లేడీ ఫ్యాన్ తేరి రీమేక్ చేస్తే చచ్చిపోతానంటూ సూసైడ్ లెటర్ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
” హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ కి.. సర్ .. ఇప్పటివరకు నేను ఒక్క లెటర్ కూడా రాయలేదు.. ఇలా సూసైడ్ లెటర్ రాస్తానని కలలో కూడా నౌకోలేదు. మీరు ఎన్ని రీమేక్ లు తీసినా నేను దేనికి ఫీల్ అవ్వలేదు. కానీ, తేరి రీమేక్ అని తెలిసాక రాయకుండా ఉండలేకపోతున్నా.. కనీసం నా చావు చూసైనా మీరు ఈ రీమేక్ ను క్యాన్సిల్ చేస్తారనుకుంటున్నా.. ఆదివారం వస్తే చాలా మా టీవీలో తేరి సినిమా 10 సార్లు వస్తుంది. దయచేసి ఈ రీమేక్ క్యాన్సిల్ చేసుకోండి.. నా చావుకు కారణం మైత్రీ మూవీ మేకర్స్.. హరీష్ శంకర్” అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై హరీష్ శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
