సైతాన్ తర్వాత సరైన హిట్స్ లేక స్గ్రగుల్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. కోట్లు పెట్టిన తీసిన మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టి నింపలేకపోయింది. ఔరో మే కహా దమ్ థా అయితే సినిమా వచ్చిందనే తెలియదు. కాస్తో కూస్తో సింగం ఎగైన్ పర్వాలేదు అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇక 20 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకున్న నామ్ కూడా హడావుడిగా వచ్చి వెళ్లిపోయింది
Also Read : Rukshar Dhillon : రూటు మార్చిన రుక్సర్.. హిట్టు దక్కేనా.?
ఇక మేనల్లుడు అమన్ దేవగన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెచ్చిన ‘ఆజాద్’ కూడా ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్,యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను దింపినా సక్సెస్ రాలేదు. దీంతో రూటు మార్చేశాడు అజయ్ దేవగన్. తనకు బాగా అచ్చొచ్చిన స్వీక్వెల్స్ పై పడ్డాడు. ఒకటి రెండు అనుకుంటే పొరపాటు ఈ ఏడాది రాబోయే సినిమాలన్నీ ఫ్రాంచేజీ చిత్రాలే కావడం గమనార్హం. 2018లో హిట్టుబొమ్మగా వచ్చిన రైడ్ సీక్వెల్లో కనిపించబోతున్నాడు అజయ్ దేవగన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రైడ్ 2 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే బ్లాక్ బస్టర్ సన్నాఫ్ సర్దార్ 2 జులైలో రిలీజయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా దేదే ప్యార్ దే 2 సెట్స్ పై ఉంది. ఇక అప్ కమింగ్ చిత్రాలు కూడా సీక్వెల్సే రాబోతున్నాయి. ధమాల్ 4, గోల్ మాల్ 5 ఉండబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు దృశ్యం 3 కూడా తెరకెక్కబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ లైనప్ చూస్తుంటే అజయ్ దేవగన్ సీక్వెల్ కు కేరాఫ్ అడ్రస్ గా మారినట్లే కనిపిస్తున్నాడు.