Site icon NTV Telugu

‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ఆపటానికి 9 కోట్లు!?

Allu-Arjun

‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు పొందటంలో ముందుండే మనీశ్ తెలుగు ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్, రీమేక్ తో పాటు శాటిలైట్ హక్కులను 18 నుంచి 20 కోట్లకు విడుదలకు ముందే కొనుగోలు చేశాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ కావటతో మనీశ్ పంట పండింది. యూ ట్యూబ్ లో విడుదల చేసిన హిందీ డబ్బింగ్ కూడా మనీశ్ కి గోల్డ్ మైన్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్న అల్లు అరవింద్ హిందీ రీమేక్ హక్కులను మనీశ్ నుంచి దాదాపు 8 కోట్లకు కొనుగోలు చేశాడు. అంతే కాదు తను కార్తీక్ ఆర్యన్ తో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ గా తీస్తున్న ‘షెహజాదా’ శాటిలైల్ హక్కులు కూడా మనీశ్ కే ఇచ్చేటల్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో

ప్రస్తుతానికి వస్తే ‘పుష్ప’ సక్సెస్ అంతా తలక్రిందులు చేసింది. మనీశ్ తన వద్ద ఉన్న ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలలో రిలీజ్ చేయాలని సంకల్పించాడు. అందుకు జనవరి 26ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశాడు. దీంతో అల్లు అరవింద్ కి కంగారు మొదలైంది. తను కార్తీక్ ఆర్యన్ తో తీస్తున్న ‘షెహజాదా’ సినిమాకు దెబ్బపడనుందని గ్రహించి వెంటనే ముంబై వెళ్ళి మనీశ్ ముందు వాలిపోయాడు. డబ్బింగ్ విడుదల చేయవద్దంటూ అడ్డుపుల్ల వేశాడు. మనీశ్ కి టాలీవుడ్ పెద్ద బిజినెస్. అరవింద్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ను, దిల్ రాజు ను కాదని ముందుకు వెళితే ఇక్కడ బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ పడుతుంది. దాంతో చేసేదేమి లేక కాళ్ళబేరానికి వచ్చాడు. బేరసారాలకు దిగాడు. తన నష్టం ఇంతంటూ కాకి లెక్కలు వేశాడు. 25 కోట్ల నుంచి బేరం మొదలు పెట్టాడు. చివరకు 9 కోట్లకు వ్యవహారం సెటిల్ అయింది. సో హిందీ రీమేక్ హక్కులు కానీ, ఇప్పుడు డబ్బింగ్ సినిమా ఆపినందుకు గానీ మనీశ్ కి దాదాపు 17 కోట్ల వరకూ గిట్టుబాటు అయిందన్న మాట. అంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు మనీశ్ కు పైసా లేకుండా గిట్టుబాటు అయినట్లన్నమాట. సో మనీశ్ లక్ అరవింద్ అండ్ కో బ్యాడ్ లక్ అన్నమాట.

Exit mobile version